ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా..!

ABN, First Publish Date - 2021-07-24T06:06:33+05:30

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నదని ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎస్‌ విధానం రద్దు చేయండి

ఫ్యాప్టో నాయకులు ఆందోళన


చోడవరం, జూలై 23: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నదని ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సెలర్‌ తమరాన త్రినాథ్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.చిన్నబ్బాయ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలపై ఉదాసీన ధోరణిలో ఉందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ విధానం రద్దు అంశంపై సీఎం జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. నూతన విద్యా విధానం అమలు పేరుతో పాఠశాలలను విడగొట్టే ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ట్రైనీ కలెక్టర్‌ అదితిసింగ్‌కు ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎం.మహలక్ష్మినాయుడు, కె.కామరాజు, చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ మండలాలకు చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకులు గొల్లు శ్రీనివాసరావు, దేముడుబాబు, శాంతి, ఎస్‌.శ్రీను, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-24T06:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising