ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో కిటకిటలాడిన సింహగిరి

ABN, First Publish Date - 2021-10-17T06:25:12+05:30

రాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి అధిక భక్తులు తరలిరావడంతో శనివారం సింహగిరి కిటకిటలాడింది.

సింహగిరిపై భజనలు చేస్తున్న గారిడీ బృందాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గారడీ బృందాలతో ఆధ్యాత్మిక శోభ

సింహాచలం, అక్టోబరు 16: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి అధిక భక్తులు తరలిరావడంతో శనివారం సింహగిరి కిటకిటలాడింది. దసరా సెలవులు కావడంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం నగరంలో వివాహాలు చేసుకున్న నవదంపతులు తమ కుటుంబ సభ్యులతో సహా అప్పన్న స్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో కొండదిగువ తొలిపావంచా వద్ద, సింహగిరిపై కేశఖండనశాల, ఉచిత దర్శనం, అతిశ్రీఘ్ర దర్శనం క్యూ లైన్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, అన్నప్రసాద భవనం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పల్లె ప్రాంతాల నుంచి తోటపెద్దులతో వచ్చిన గారిడీ బృందాలు స్వామివారిని కీర్తిస్తూ గానం చేయడంతో సింహగిరిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 



Updated Date - 2021-10-17T06:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising