ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత

ABN, First Publish Date - 2021-12-30T05:55:59+05:30

శాస్త్రం బోధించడానికి అధ్యాపకులు లేరు. అలాగే ఆంగ్లం అధ్యాపక పోస్టులు 2, తెలుగు 2, హిందీ 8, మ్యాథ్స్‌ 5, ఫిజిక్స్‌ 1, జువాలజీ 4, ఎకానమిక్స్‌ 6, సివిక్స్‌ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకుల కొరత వున్న కళాశాలల్లో బోధన సక్రమంగా సాగకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా 39 కళాశాలల్లో కేవలం పదహారింటికి మాత్రమే రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగతా 23 ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలోని 39 కళాశాలల్లో 436 పోస్టులు

రెగ్యులర్‌ అధ్యాపకులు 165 మందే 

కాంట్రాక్టు పద్ధతిలో మరో 187 మంది నియామకం

ఇంకా 84 పోస్టులు ఖాళీ

ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో 23 కళాశాలలు



మద్దిలపాలెం, డిసెంబరు 29: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 39 జూనియర్‌ కళాశాలల్లో 436 పోస్టులకు గాను ప్రస్తుతం 165 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. మరో 187 మందిని కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. ఇంకా 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

కళాశాలల్లో అవసరం మేరకు గతంలో గెస్ట్‌ ఫ్యాకల్టీని తీసుకునేవారు. వారిని ఏటా రెన్యువల్‌ చేసేవారు. అయితే కొవిడ్‌-19 ప్రభావంతో కళాశాలలు మూతపడడంతో రెండేళ్ల నుంచి గెస్ట్‌ ఫ్యాకల్టీల రెన్యువల్‌ జరగలేదు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో కళాశాలలను ప్రారంభించినప్పటికీ గెస్ట్‌ ఫ్యాకల్టీలను నియమించకపోవడంతో బోధన కుంటుపడింది. జిల్లాలోని 11 కళాశాలల్లో బోటనీ, 16 కళాశాలల్లో చరిత్ర, రాజ్యాంగనీతి    శాస్త్రం బోధించడానికి అధ్యాపకులు లేరు. అలాగే ఆంగ్లం అధ్యాపక పోస్టులు 2, తెలుగు 2, హిందీ 8, మ్యాథ్స్‌ 5, ఫిజిక్స్‌ 1, జువాలజీ 4, ఎకానమిక్స్‌ 6, సివిక్స్‌ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకుల కొరత వున్న కళాశాలల్లో బోధన సక్రమంగా సాగకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా 39 కళాశాలల్లో కేవలం పదహారింటికి మాత్రమే రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగతా 23 ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-12-30T05:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising