ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు కంపు.. పందుల గుంపు..!

ABN, First Publish Date - 2021-10-24T06:03:45+05:30

మునిసిపాలిటీ పరిధి వెంకునాయుడుపేట, ప్రశాంతినగర్‌లను మురుగు సమస్య వీడడం లేదు. కాలువలు అస్త వ్యస్తంగా మారడంతో వీధి రోడ్లపైకి చేరి నిలిచిపోతోంది.

వెంకునాయుడుపేటలో రోడ్డుపై నిలిచిన మురుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  వెంకునాయుడుపేట, ప్రశాంతినగర్‌లను నిత్యం వెంటాడుతున్న సమస్యలు

 పట్టించుకోని మునిసిపాలిటీ 

నర్సీపట్నం, అక్టోబరు 23 : మునిసిపాలిటీ పరిధి వెంకునాయుడుపేట, ప్రశాంతినగర్‌లను మురుగు సమస్య వీడడం లేదు. కాలువలు అస్త వ్యస్తంగా మారడంతో వీధి రోడ్లపైకి చేరి నిలిచిపోతోంది. దీంతో ఆయా ప్రాం తాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విజృంభిస్తుండడంతో అంటు వ్యాధుల భయం వెంటాడుతోంది. పం దుల సంచారం కూడా అధికంగానే ఉంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మునిసిపల్‌ అధికారులు పట్టిం చుకోవడం లేదని పలువురు ఆరోపిస్తు న్నారు.   వెంకునాయుడుపేట వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో రోడ్డుపై నెలల తర బడి మురుగు పేరుకుపోతుండ డంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. చిన్నపాటి వర్షం పడినా రోడ్డంతా మురుగుమయంగా మారు తోంది.  రెండు రోజుల క్రితం మురు గులో మహిళ పడిపోవడంతో గాయాల య్యాయి. ఇదిలావుంటే, పందులు ఇక్కడి వాతావరణాన్ని మరింత పాడు చేస్తున్నాయి. మునిసిపల్‌ అధికారులు పందులను పట్టేందుకు ప్రత్యేక బృందాలను తీసుకొచ్చినప్పుడు పందుల కాపరులు అడ్డుపడుతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్న తాధికారులు ఇక్కడి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అంతా కోరు తున్నారు. 

Updated Date - 2021-10-24T06:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising