ఏజెన్సీ చట్టాలపై సచివాలయం ఉద్యోగులకు అవగాహన ఉండాలి
ABN, First Publish Date - 2021-08-08T05:59:54+05:30
షెడ్యుల్డ్ ప్రాంత చట్టాలపై సచివాలయ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ లీగల్ అడ్వయిజర్ త్రినాథరావు అన్నారు.
చింతపల్లి, ఆగస్టు 7: షెడ్యుల్డ్ ప్రాంత చట్టాలపై సచివాలయ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ లీగల్ అడ్వయిజర్ త్రినాథరావు అన్నారు. శనివారం స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాల-1లో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల సచివాలయాల ఇంజనీరింగ్, వెల్ఫేర్ అసిస్టెంట్లకు షెడ్యుల్డ్ ప్రాంత చట్టాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు రాజ్యాంగం కల్పించడం జరిగిందన్నారు. ప్రధానంగా పెసా, 1/70 భూబదలాయింపు, అటవీ హక్కుల గుర్తింపు, భూసేకరణ, పునరావాస చట్టాలు అమలులో ఉన్నాయన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్ హెల్త్ సమన్వయకర్త నాగరాజు పడాల్, ట్రైబల్ హెల్త్ ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు, ఆశ్రమ పాఠశాల పీజీహెచ్‌ఎం జేఏ కొండలరావు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-08T05:59:54+05:30 IST