ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరకు ఆస్పత్రిలో రెండో ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN, First Publish Date - 2021-12-05T05:43:13+05:30

అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రెండో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అరకులోయ, డిసెంబరు 4: అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రెండో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో మన్యంలో కరోనా రోగులు ఆక్సిజన్‌ అందక చాలామంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు అవసరమని గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లను మంజూరు చేశాయి. తొలుత కేంద్రం సమకూర్చిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఇటీవలే ప్రధానమంత్రి భోపాల్‌లో వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం మిషనరీ వచ్చింది. వీటికి అవసరమైన షెడ్‌, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో నెలన్నర రోజుల్లో రెండో ప్లాంట్‌ అందుబాటులోకి రానుంది. తొలుత ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరా పూర్తి స్థాయిలో జరగక పనిచేయడం లేదు. ఇక.. రెండో ప్లాంట్‌ సిద్ధమైనా విద్యుత్‌ సమస్య వెంటాడనున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు హైపవర్‌ ట్రాన్సఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. హైపవర్‌ విద్యుత్‌ను సరఫరా చేయకుంటే ఆక్సిజన్‌ ప్లాంట్లు అలంకరప్రాయంగా ఉండేపోయే అవకాశం ఉంది. 


Updated Date - 2021-12-05T05:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising