ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంకర భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోంది: స్వరూపానందేంద్ర

ABN, First Publish Date - 2021-05-17T19:19:06+05:30

జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను రిషికేశ్‌లోని తమ ఆశ్రమంలో విశాఖ శారదాపీఠం వైభవంగా నిర్వహించింది. సోమవారం ఉదయం ఆదిశంకరాచార్యునికి ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిషికేశ్: జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను రిషికేశ్‌లోని తమ ఆశ్రమంలో విశాఖ శారదాపీఠం వైభవంగా నిర్వహించింది. సోమవారం ఉదయం ఆదిశంకరాచార్యునికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అధ్యాస భాష్యాన్ని పారాయణ చేసారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆదిశంకరులు యావత్ ప్రపంచానికే జగద్గురువులు అని కీర్తించారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందని వివరించారు. శంకర భాష్యంపై  ప్రపంచంలోనే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేవభూమిగా పేరున్న రిషికేశ్ ప్రాంతంలో పవిత్ర గంగానదీ తీరాన శంకర జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి మూడుపూటలా వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధించనున్నట్లు ప్రకటించారు. చాతుర్మాస్య దీక్ష ముగిసే వరకు నాలుగు నెలల పాట ఈ పాఠాలు ఉంటాయని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. 


Updated Date - 2021-05-17T19:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising