ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నిరసనకు సబ్బంహరి సంఘీభావం

ABN, First Publish Date - 2021-02-27T05:17:41+05:30

మండలంలోని గండిగుండం పంచాయతీ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని తెలుగుదేశం మద్దతు అభ్యర్థి గండ్రెడ్డి రమేష్‌నాయుడు తరఫున గ్రామస్థులు చేపట్టిన నిరసన ఐదో రోజుకు చేరింది. రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ శిబిరాన్ని శుక్రవారం పార్టీ భీమిలి ఇన్‌చార్జి సబ్బం హరి సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

శిబిరంలో మాట్లాడుతున్న టీడీపీ నేత సబ్బం హరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆనందపురం, ఫిబ్రవరి 26: మండలంలోని గండిగుండం పంచాయతీ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని తెలుగుదేశం మద్దతు అభ్యర్థి గండ్రెడ్డి రమేష్‌నాయుడు తరఫున గ్రామస్థులు చేపట్టిన నిరసన ఐదో రోజుకు చేరింది. రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ శిబిరాన్ని శుక్రవారం పార్టీ భీమిలి ఇన్‌చార్జి సబ్బం హరి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్నారు. గండిగుండం పంచాయతీలో జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అధికారులు స్పందించి రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు గ్రామస్థులు మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బంది అధికార పార్టీకి  మద్దతుగా తప్పులు చేశారని ఆరోపించారు. స్వస్తిక్‌ గుర్తు కలిగిన స్టిక్‌ మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని, కానీ వేలి ముద్రలున్న  ఓట్లు బ్యాలెట్‌ బాక్స్‌లలోనికి ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని రిటర్నింగ్‌ అధికారిని అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంపై అనుమానాలున్నాయన్నారు. రీపోలింగ్‌ నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ముందుగా గ్రామ సచివాలయ సిబ్బందిని విధులకు హజరు కాకుండా అడ్డుకుని, అనంతరం విడిచిపెట్టారు.  ఈ కార్యక్రమంలో భీమిలి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కోరాడ నాగభూషణరావు, భీమిలి పార్టీ అధ్యక్షుడు డీవీడీఎన్‌రాజు, వుడా మాజీ డైరెక్టర్‌ గండ్రెడ్డి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising