ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీకి పండుగ

ABN, First Publish Date - 2021-10-24T06:06:01+05:30

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌కు దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.1,06,20,875 ఆదాయం సమకూరింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరాకు రూ.1.06 కోట్లు ఆదాయం

460 ప్రత్యేక సర్వీసులు నడిపిన సంస్థ

92 శాతంఆక్యుపెన్సీ రేషియో నమోదు 

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 23: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌కు దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.1,06,20,875 ఆదాయం సమకూరింది. ఈనెల 8 నుంచి 22 వరకు వివిధ ప్రాంతాలకు 460 ప్రత్యేక సర్వీసులు నడపగా సగటు ఆక్యుపెన్సీ రేషియో 92 శాతంగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేకమంది విద్య, ఉద్యోగ, వ్యాపార, ఇతర వ్యవహారాల రీత్యా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో ఉం టున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నారు. వీరంతా దసరాకు స్వస్థలాలకు వెళ్ల డం, పండుగ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణం కావడం సాధారణం. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి డిమాండ్‌ వుండడంతో రీజియన్‌లోని పది డిపోల నుంచి ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఆలా్ట్ర డీలక్స్‌ వంటి సర్వీసులను సంస్థ నడిపింది. గాజువాక డిపో నుంచి 33, సింహాచలం నుంచి 8, వాల్తేరు నుంచి 69, మద్దిలపాలెం నుంచి 113, విశాఖ స్టీల్‌సిటీ డిపో నుంచి 26, అనకాపల్లి నుంచి 23, మధురవాడ నుంచి 19, నర్సీపట్నం నుంచి 65, పాడేరు నుంచి 5, విశాఖపట్నం డిపో నుంచి 99 ప్రత్యేక సర్వీసులను ఆపరేట్‌ చేసింది. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, ఖమ్మం, ఒంగోలు, నెల్లూరు, భీమవరంతో పాటు జోనల్‌ పరిధిలోని కాకినాడ, రాజమండ్రి, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, పర్లాకిమిడి, శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, పార్వతీపురాలకు ఈ సర్వీసులు నడిచాయి. 

Updated Date - 2021-10-24T06:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising