ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.25 లక్షలు స్వాధీనం

ABN, First Publish Date - 2021-01-27T05:53:00+05:30

నగరంలోని ద్వారకా నగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడలి వద్ద సీఐ గొలగాని అప్పారావు, సిబ్బంది మంగళవారం సాయంత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రూ.25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో ఇద్దరు కేరళ వాసులు


సీతంపేట (విశాఖపట్నం), జనవరి 26: నగరంలోని ద్వారకా నగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడలి వద్ద సీఐ గొలగాని అప్పారావు, సిబ్బంది మంగళవారం సాయంత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రూ.25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు...ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని ఆపారు. వారిద్దరూ కంగారు పడుతుండడంతో ప్రశ్నించి వారి వద్ద బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో రూ.25 లక్షల నగదు ఉంది. ఆ నగదుకు సంబంధించి వివరాలు అడగ్గా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని సీఐ విచారించగా...తాము ఉద్యోగ రీత్యా కేరళ నుంచి విశాఖ వచ్చామని, తమ పేర్లు ఈకే రిష్వాన్‌, మోసూరి శివతేజగా పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆ నగదును ముంబై తీసుకువెళ్లి అప్పగించాలని కోరినట్టు వెల్లడించారు. ఎస్‌ఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-27T05:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising