ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్‌ సాగుకు పెద్దేరు కుడి కాలువ నీరు

ABN, First Publish Date - 2021-07-25T05:54:02+05:30

పెద్దేరు జలాశయం నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్‌కు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ డీఈ వి.బాలసూర్యం తెలిపారు.

మేడివాడ పెద్ద చెరువు కుడి కాలువ పూడికతీత పనులను పరిశీలిస్తున్న డీఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరిగేషన్‌ డీఈ బాలసూర్యం


రావికమతం, జూలై 24: పెద్దేరు జలాశయం నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ఖరీఫ్‌కు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ డీఈ వి.బాలసూర్యం తెలిపారు. మేడివాడ పెద్దచెరువు వద్ద జరుగుతున్న పూడికతీత పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండేళ్లుగా కుడి కాలువ నుంచి ఆయకట్టుకు రిజర్వాయర్‌ నీరు అందలేదన్న రైతుల విజ్ఞప్తి మేరకు రూ.28 లక్షలతో పనులు పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ నిధులతో కుడి ప్రధాన కాలువ డ్యామ్‌ నుంచి మేడివాడ పెద్దచెరువు వరకు 19 కిలోమీటర్లు, మేడివాడ పెద్ద చెరువు నుంచి బుచ్చియ్యపేట చిన్నాలు చెరువు వరకు ఏడు కిలోమీటర్లు, చిన్నాలు చెరువు నుంచి మరో ఐదు కిలోమీటర్లు కాలువను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ఈ పనులు పూర్తయితే కుడి కాలువ కింద ఉన్న ఆయకట్టు భూములకు జలాశయం ద్వారాసాగునీటికి ఎటువంటి అవరోధాలు ఉండన్నారు. పనుల్లో ఏమైనా లోపాలు ఉన్నా, రైతులకు ఇబ్బందులు తలెత్తినా కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేది లేదని డీఈ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈలు భాగ్యలక్ష్మి, మల్లేశ్వరి, క్వాలిటీ కంట్రోల్‌ ఏఈలు విశ్వశాంతి, పైడితల్లిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising