ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఎంఆర్డీఏ అభివృద్ధిపై సమీక్ష

ABN, First Publish Date - 2021-01-21T04:44:53+05:30

వీఎంఆర్డీఏ ఆర్ధిక, అభివృద్ధి కార్యక్రమాలపై పేపర్‌ లైడ్‌ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్‌ యలమంచిలి వెంకటబాబు రాజేంద్రప్రసాద్‌, సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు, చిక్కా రామచంద్రరావులు బుధవారం వీఎంఆర్డీఏ హాల్‌లో సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పేపర్‌ లైడ్‌ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం, జనవరి 20: వీఎంఆర్డీఏ ఆర్ధిక, అభివృద్ధి కార్యక్రమాలపై పేపర్‌ లైడ్‌ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్‌ యలమంచిలి వెంకటబాబు రాజేంద్రప్రసాద్‌, సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు, చిక్కా రామచంద్రరావులు బుధవారం వీఎంఆర్డీఏ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. వీఎంఆర్డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు సంస్థ పరిధి, లక్ష్యాలు, చేపడుతున్న కార్యక్రమాలు, ఆర్థికపరమైన అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా, ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీఎంఆర్డీఏ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను క్షేత్రస్థాయిలో ముందుగానే సర్వే రాళ్లతో మార్కింగ్‌ చేయాలన్నారు. విశాఖలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్న కాలుష్యం నియంత్రణకు శాస్ర్తీయ పద్ధతిలో అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌ జిలానీ సామూహన్‌, కార్యదర్శి గణేశ్‌కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ రామ్మోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T04:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising