ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరాష్ట్రపతి పర్యటనకు బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

ABN, First Publish Date - 2021-10-30T04:13:33+05:30

మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నవంబరు 2న ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

లా వర్సిటీలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అనకాపల్లి డీఎస్పీ సునీల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, అక్టోబరు 29 : మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నవంబరు 2న ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వర్సిటీలో ఆజాదీకా అమృత్‌ ఉత్సవ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాగా సబ్బవరం నుంచి వర్సిటీ వరకు ట్రాఫిక్‌తో సహా బందోబస్తు ఏర్పాట్లను సీఐ చంద్రశేఖరరావును అడిగి తెలుసుకున్నారు. మెట్లమార్గం, లిఫ్ట్‌, మీటింగ్‌ హాల్లో ఏర్పాట్లు, సమావేశానికి ఎంత మంది హాజరవుతారు? వంటి అన్ని అంశాలను వర్సిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎల్‌ సురేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు భద్రతాపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


Updated Date - 2021-10-30T04:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising