ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలపై డీఎంకు వినతి

ABN, First Publish Date - 2021-10-19T06:21:47+05:30

పీటీడీలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక పీటీడీ డిపో మేనేజర్‌ ఆర్‌.సీ.నాయుడుకి సీఐటీయూ నేతలు సోమవారం వినతిపత్రం సమర్పించారు.

పీటీడీ డీఎం నాయుడుకు వినతిపత్రం సమర్పిస్తున్న సీఐటీయూ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు, అక్టోబరు 18: పీటీడీలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక పీటీడీ డిపో మేనేజర్‌ ఆర్‌.సీ.నాయుడుకి సీఐటీయూ నేతలు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వాలని, రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సర్క్యూలర్‌ పరంగా పేర్కొన్న వేతనానికి, వారికి ఇస్తున్న వేతనానికి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తేడా ఉంటుందన్నారు. దీంతో నాలుగు సంవత్సరాలుగా ఒక్కోక్క కార్మికుడు రూ.50 వేలు చొప్పున నష్టపోతున్నారన్నారు. సిబ్బందికి వేతనాల్లో కోత విధిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు, గౌరవాధ్యక్షుడు తులసీరామ్‌, సిబ్బంది కుమార్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising