ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఈసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి పదవీకాలం పొడిగింపు

ABN, First Publish Date - 2021-06-22T05:30:00+05:30

ఆర్‌ఈసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి పదవీకాలం పొడిగింపు

ఆర్‌ఈసీఎస్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్వులు జారీ చేసిన సహకార శాఖ సీఎస్‌


కశింకోట, జూన్‌ 22: అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం(ఆర్‌ఈసీఎస్‌) పర్సన్‌ ఇన్‌చార్జి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ సహకార శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈపీడీసీఎల్‌లో ఆర్‌ఈసీఎస్‌ విలీనం లేనట్టేనని భావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ఈసీఎస్‌ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించలేదు. అంతకుముందు 2017 నవంబరు నుంచి 2018 నవంబరు వరకు మలసాల రమణరావు ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు జరపలేదు. ఎవర్నీ చైర్మన్‌గా నియమించలేదు. తరువాత ఏడాదిపాటు ప్రస్తుత ఎండీ ఎం.రామకృష్ణంరాజు పర్సన్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2019 నవంబరులో జిల్లాసహకార ఆడిట్‌ అధికారి ఎం.శ్యామల పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆరు నెలలకోసారి ఆమె పదవీ కాలాన్ని పొడిగిస్తున్నారు. మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ సహకార శాఖ ముఖ్యకార్యదర్శి వై.మఽధుసూదనరెడ్డి ఈనెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే ఆరో తేదీ నుంచి నవంబరు ఐదో తేదీ వరకు శ్యామల పర్సన్‌ఇన్‌చార్జిగా వుంటారని పేర్కొన్నారు.


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising