ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధ్యతగా పనిచేస్తేనే గుర్తింపు

ABN, First Publish Date - 2021-01-27T05:06:38+05:30

దేశ పౌరులకు భారత రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలు కూడా సూచించింది దీనిని గర్తించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య అన్నారు.

నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న సబ్‌కలెక్టర్‌ మౌర్య, కమిషనర్‌ కనకారావు, ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న డీఎఫ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ మౌర్య 

ఘనంగా గణతంత్ర దినోత్సవం 

నర్సీపట్నం, జనవరి 26: దేశ పౌరులకు భారత రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలు కూడా సూచించింది దీనిని గర్తించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య అన్నారు. మంగళవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయంలో ఆమె  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కనకారావు, డివిజనల్‌ అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో కె.వినోద్‌కుమార్‌ రిపబ్లిక్‌డే వే డుకలు నిర్వహించి అవార్డులు అందజేశారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ వేణుగోపారావు, పట్టణ, గ్రామీణ పోలీస్‌స్టేషన్లలో సీఐలు స్వామినాయుడు, కె.శ్రీనివాసరావు, ఎస్‌ఈబీ కార్యాలయంలో సీఐ సంతోష్‌ జెండా ఎగురవేశారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకట్రావు పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు జరిగాయి.  నర్సీపట్నం మండలంలో  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవం జరిగింది.  రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ జయ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రమేష్‌, ఎంపీడీవో జయమాధవి జెండా ఎగురవేశారు. 

Updated Date - 2021-01-27T05:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising