ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసవత్తరం... సమ్మక్క-సారలమ్మ నాటకం

ABN, First Publish Date - 2021-10-30T05:00:38+05:30

సురభి నాటకోత్సవాలు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రదర్శించిన శ్రీసమ్మక్క-సారలమ్మ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మేడరాజు వేటకు వెళ్లి పులులు, సింహాలు కాపలాగా ఉన్న పాప దైవాంశసంభూతురాలని, ఆ పాపకు సమ్మక్క పేరు పెట్టి పెంచుతారు.

సమ్మక్క సారలమ్మ నాటకంలోని ఓ సన్నివేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్సాహంగా సాగుతున్న సురభి నాటకోత్సవాలు 

మద్దిలపాలెం, అక్టోబరు 29: సురభి నాటకోత్సవాలు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రదర్శించిన శ్రీసమ్మక్క-సారలమ్మ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మేడరాజు వేటకు వెళ్లి పులులు, సింహాలు కాపలాగా ఉన్న పాప దైవాంశసంభూతురాలని, ఆ పాపకు సమ్మక్క పేరు పెట్టి పెంచుతారు. కరువులో తోడుగా నిలిచిన సమ్మక్కను దేవతగా కొలవడం, ఆమె హస్తవాసి వారి నమ్మకాన్ని మరింత పెంచడం, ఆమె చేతితో ఆకు పసరు ఇస్తే ఎంతటి రోగమైనా తగ్గిపోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశాయి. ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తిరాగా సంప్రదాయ ఆయుధాలతో సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, నాగులమ్మ చేసిన గెరిల్లా యుద్ధాలు రక్తి కట్టించాయి. వీరోచిత పోరాటంతో తీవ్రగాయాలైన సమ్మక్క యుద్ధభూమి నుంచి నిష్క్రమించి కొంతదూరం వెళ్లాక అదృశ్యమవడం, ఆ ప్రాంతంలో పుట్ట వద్ద పసుపు, కుంకుమ భరిణె లభ్యమవడంతో  సమ్మక్కగా భావించి రెండేళ్లకొకసారి జాతర చేసేవిధానం అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగసాయి నాటక సంఘం నిర్వహకుడు బాదంగీర్‌ సాయి, కళాభిమానులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T05:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising