ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా రాంబాబు బాధ్యతలు స్వీకారం

ABN, First Publish Date - 2021-05-09T04:54:44+05:30

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఆంధ్రా మెడికల్‌ కళాశాల జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ కె.రాంబాబు శనివారం బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్‌ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, మే 8: విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఆంధ్రా మెడికల్‌ కళాశాల జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ కె.రాంబాబు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ కడలి సత్యవరప్రసాద్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డాక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ విధుల నిర్వహణలో సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న సేవలు గురించి తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కాగా డాక్టర్‌ రాంబాబుకు డాక్టర్‌ సత్యవరప్రసాద్‌, పలువురు వైద్యులు, పరిపాలనాధికారి ఎస్‌కే బాజిత్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ సిబ్బంది, తదితరులు అభినందనలు తెలియజేశారు. కాగా విమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమితులైన డాక్టర్‌ కె.రాంబాబుకు ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.  


Updated Date - 2021-05-09T04:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising