ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుకు సై..నీరు నై..!

ABN, First Publish Date - 2021-06-22T05:31:47+05:30

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. అడపాదడపా వర్షాలు కురిశాయి. ఏరువాకకు రైతన్న సిద్ధమయ్యాడు. విత్తనాలు కొనుగోలు చేసి వరి నారు వేశాడు.

లింగాపురం వద్ద తాండవ కాలువ లైనింగ్‌ పనులు అర్ధంతరంగా నిలిచిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

 ‘తాండవ’ శివారు ఆయకట్టు రైతుల కష్టాలు 

 కాలువల్లో  పేరుకుపోయిన పూడుక

 ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో  ఇదే పరిస్థితి 

 కన్నెత్తి చూడని పాలకులు, అధికారులు 

కోటవురట్ల, జూన్‌ 21 : ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. అడపాదడపా వర్షాలు కురిశాయి. ఏరువాకకు రైతన్న సిద్ధమయ్యాడు. విత్తనాలు కొనుగోలు చేసి వరి నారు వేశాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. నాట్లు వేసే సమయానికి పొలానికి నీరు అందని పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. కోటవురట్ల మం డలం పరిధిలోని గ్రామాలకు చెందిన శివారు కాలువలు పూడుకు పోయాయి. ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు పెరిగి పోవడంతో పంట భూములను నీరు చేరే పరిస్థితి లేకపోతోంది. ఏటా ఖరీ ఫ్‌లో తాము ఈ ఇబ్బందులు ఎదు ర్కొం టున్నా పరిష్కారం చూపడం లేదు. లిం గాపురం నుంచి కైలాసపట్నం వరకు తాండవ శివారు కాలువలకు లైనింగ్‌ పనులు చేయడంలో పాలకులు నిర ్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.


ఇదీ శివారు కాలువల దుస్థితి

    తాండవ ప్రాజెక్టు సాగు నీటి కాలువల లైనింగ్‌ పనులు శివారు గ్రామాలకు వరకు చేయకపోవడం వల్ల ఏటా అన్నదాత అవస్థలు పడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా తాండవ కాలువలో పూడికలు పేరుకుపోవడంతో ఆయకట్టుకు నీరు అందడం లేదు.  దీంతో శివారు భూముల రైతులు పెట్టుబడులు పెడు తున్నా సరిగా పంట దక్కని పరిస్థితులు నెలకొంటున్నారు. ఏటా ఇదే సమస్య అని లింగాపురం, కోటవురట్ల, రాట్నాలపాలెం, కైలాసపట్నం గ్రామాల రైతులు వాపోతున్నారు. 


5 వేల ఎకరాలకు నీరు అవసరం

మండలంలో తాండవ ప్రాజెక్టు ద్వారా సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ లైనింగ్‌ పనులు అయినంత వరకు 2800 ఎకరాలకు సాగునీరు పారుతుంది. పాలకుల నిర్లక్ష్యంతో ఎగువ ఆయకట్టు దారులకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా వుంటే, తాండవ శివారు భూములకు సాగునీరు అందిస్తామని ప్రాజెక్టు చైర్మన్‌ ప్రకటనలే తప్ప కార్యరూపం దాల్చడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తు తం పాములవాక, నీలిగుంట, బోడపాలెం, భీంరెడ్డి పాలెం, బీకేపల్లి తదితర గ్రామాలకు మాత్రమే సాగునీరు అందు తుంది. లింగాపురం, కోటవురట్ల, కైలాసపట్నం రాట్నాపాలెం తదితర శివారు గ్రామాల ఆయకట్టుకు చుక్కనీరు అందని పరిస్ధితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పం దించి సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేపట్టి, సాగు భూములకు నీరు అందించాలని రైతులంతా కోరుతున్నారు. 

Updated Date - 2021-06-22T05:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising