ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు

ABN, First Publish Date - 2021-09-03T06:27:54+05:30

రాష్ట్రంలో వైసీపీ అధకారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైందని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు దేవర రవి అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్కారు వైఫల్యంపై నిలదీసిన వారిపై దాడులు

తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్‌


చోడవరం, సెప్టెంబరు 2: రాష్ట్రంలో వైసీపీ అధకారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైందని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు దేవర రవి అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం దిశ చట్టంపై విపరీతంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసే వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వేధింపులు తమ పోరాటాన్ని ఆపలేవని, ప్రజలు అంతా గమనిస్తున్నారని రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రాష్ట్రంలో అరాచక పాలన

ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతిలో ఆందోళన చేస్తున్న తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబుపై పోలీసులు తీరు దుర్మార్గమని, అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గ రపడ్డాయని పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షుడు ఎస్‌.శ్రీరామమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలతో పాటు సామాన్యులకు సైతం రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకాలను ప్రశ్నించడాన్ని తట్టుకోలేక తమ కార్యకర్తలపై గృహ నిర్భంధాలకు దిగడం ప్రభుత్వ పాశవిక చర్యలకు నిదర్శమన్నారు.  

Updated Date - 2021-09-03T06:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising