ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌ సీతారామ్‌కు ప్రెసిడెంట్‌ పోలీస్‌ పతకం

ABN, First Publish Date - 2021-08-15T05:51:20+05:30

విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను నగరంలోని గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయం కమాండెంట్‌ పి.సీతారామ్‌కు ప్రభుత్వం ప్రెసిడెంట్‌ పోలీస్‌ పతకం (పీపీఎం) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను  నగరంలోని గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయం కమాండెంట్‌ పి.సీతారామ్‌కు ప్రభుత్వం ప్రెసిడెంట్‌ పోలీస్‌ పతకం (పీపీఎం) ప్రకటించింది. నాన్‌కేడర్‌ ఎస్పీ హోదాలో పనిచేస్తున్న సీతారామ్‌కు ఇప్పటికే ఇండియన్‌ పోలీస్‌ పతకంతోపాటు పలు పతకాలు వచ్చాయి. 1991లో ఎస్‌ఐగా సర్వీస్‌లో చేసిన సీతారామ్‌ విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు పీపీఎం పతకం ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించనున్నారు.


చింతపల్లి ఎస్‌ఐ పాపినాయుడుకు కేంద్ర పతకం

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చింతపల్లి ఎస్‌ఐ కె.పాపినాయుడుకు పోలీస్‌ మెడల్‌ ఆఫ్‌ గేలంట్రీ (పోలీస్‌ పతకం) అవార్డు ప్రకటించింది. ఆయనతో పాటు కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేసే పలువునే అధికారులు, సిబ్బందికి పతకాలు లభించాయి. వీరంతా వచ్చే జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున పతకాలు తీసుకుంటారు. 


మరో 65 కరోనా కేసులు

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం 65 కరోనా కేసులు నమోద య్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,54,208కు చేరింది. ఇందులో 1,51,731 కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 1064కు చేరింది. 

Updated Date - 2021-08-15T05:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising