ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు

ABN, First Publish Date - 2021-04-17T04:49:34+05:30

మన్యంలో మలేరియా నియంత్రకు దోమల మందు పిరికారీ పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌. ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌

పాడేరు ఏప్రిల్‌ 16: మన్యంలో మలేరియా నియంత్రకు దోమల మందు పిరికారీ పనులు సమర్థవంతంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌. ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. శుక్రవారం 11 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, సచివాలయం సిబ్బందితో ఐటీడీఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే నెల 31 నాటికి 1,545 గ్రామాల్లో దోమల మందు పిచికారీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పిచికారీ పర్యవేక్షణ బాధ్యత వలంటీర్లు, మహిళా పోలీసులకు అప్పగించాలన్నారు. ఇంటి లోపల, బయట తప్పనిసరిగా దోమల మందు పిచికారీ చేయాలన్నారు. పిచికారీలో సర్పంచ్‌, వార్డు సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. షెడ్యూల్డ్‌ ప్రకారం పనులు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి వై.మణి, డీఎల్‌డీవో జి.చిట్టిరాజు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T04:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising