పవర్‌ఫుల్ ‘మనీష్’
ABN, First Publish Date - 2021-10-29T06:16:21+05:30
ఈనెల 19న నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ముట్టడించిన ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పోలీస్ బ్యారెక్స్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్‌లో ఏర్పాటుచేసిన ఆయుధాల ప్రదర్శనలో ఓ గన్‌ను చేతిలోకి తీసుకుని పరిశీలిస్తున్న నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా.
టీడీపీ కార్యాలయ ముట్టడిపై కేసు నమోదుచేయలేదు
దాడి, ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకోలేదు
ప్రైవేటు ఆవరణలో ధర్నా చేస్తే నేరంకాదు
సీపీ మనీష్‌కుమార్‌సిన్హా
విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఈనెల 19న నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ముట్టడించిన ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా అన్నారు. చోరీ కేసుల దర్యాప్తుపై ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను విలేఖరులు ప్రస్తావించగా...తెరిచివున్న ఏదైనా ప్రైవేటు ఆవరణలోకి ప్రవేశించడం నేరం కాదన్నారు. ఆవరణలో విధ్వంసం చేసినా, అనుమతి లేకుండా భవనం లోపలకు వెళ్లినా, లేదా దాడి చేసినా నేరమన్నారు. అయితే టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లిన సుమారు 20 మంది వైసీపీ మహిళలు శాంతియుతంగా బైఠాయించి నినాదాలు చేశారన్నారు. దీనిపై తమకు సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఈస్ట్, ద్వారకా సబ్‌డివిజన్ ఏసీపీలు సిబ్బందితోపాటు అక్కడకు చేరుకుని వారందరినీ బయటకు పంపించేశారన్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ తమ వద్ద ఉందని, పలుమార్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేయడానికి అవకాశం లేదని నిర్ధారించామన్నారు.
Updated Date - 2021-10-29T06:16:21+05:30 IST