ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

ABN, First Publish Date - 2021-12-03T06:09:17+05:30

నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు విజిబుల్‌ ట్రాఫిక్‌ పోలీసింగ్‌ను పెంచినట్టు పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు ప్రమాదాల నివారణకు విజిబుల్‌ ట్రాఫిక్‌ పోలీసింగ్‌

నిబంధనలు ఉల్లంఘిస్తే  జరిమానాలు, వాహనాల సీజ్‌

ఎస్‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు

‘ఆంధ్రజ్యోతి’తో సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా


విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు విజిబుల్‌ ట్రాఫిక్‌ పోలీసింగ్‌ను పెంచినట్టు పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా తెలిపారు. ఆయన గురు వారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిఽ దితో మాట్లాడుతూ వాహన చోదకుల్లో నిర్లక్ష్యం పెరిగిపోవడంతోపాటు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారన్నారు. సీసీ కెమెరాలు వున్నచోట ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు తీసి ఆటోమేటిక్‌గా చలానాలు జారీచేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదన్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని పోలీసులు రోడ్డుపై కనిపించేలా (విజిబుల్‌ పోలీ సింగ్‌) స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించామన్నారు. ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారు, హెల్మెట్‌ ధరించని వారిపై కేసులు నమోదుచేయడంతోపాటు మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని గుర్తించేందుకు తిరిగి బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలని సూచించామన్నారు. గత మూడు రోజుల్లో నగర వ్యాప్తంగా ఎంవీ యాక్ట్‌ ఉల్లంఘించిన 14 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసి వాహనాలను సీజ్‌ చేశామన్నారు. అలాగే హెల్మెట్‌ ధరించకుండా వాహనాలను నడుపుతున్న 2,797 మందిపైనా, ప్రమాదకరంగా వాహనాలను నడుపుతున్న 12 మందిపైనా, మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 43 మందిపైనా కేసులు నమోదుచేసి జరిమానా విధించామన్నారు. వీటిలో అత్యధిక కేసులు గాజువాక, స్టీల్‌ప్లాంట్‌; పీఎంపాలెం, టూటౌన్‌, ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే నమోదయ్యాయన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎస్‌ఐ, సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే చోట గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. కేసుల నమోదుకే పరిమితం కాకుం డా ట్రాఫిక్‌ నిబందనలు పాటించాలిన ఆవశ్యకత, ప్రమాదాలకు దారితీసే పరిస్థితులపై వాహనచోదకులకు తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారన్నారు. 

Updated Date - 2021-12-03T06:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising