ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-06-22T05:35:27+05:30

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు.

యోగా పోటీల విజేతలను సత్కరిస్తున్న ముత్యాలనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు

చోడవరం, జూన్‌ 21:
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. స్థానిక ఉషోదయ కళాశాలలో సోమవారం యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. బాల్యం నుంచే పిల్లలకు యోగాను అలవాటుగా మార్చితే సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని చెప్పారు. ఉషోదయ చైర్మన్‌ జి.రమణాజీ మాట్లాడుతూ, తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇప్పిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో బహుమతులు సాధించిన  పతంజలి యోగా శిక్షణ కేంద్రం విద్యార్థులు గొంతిన లయవర్ధన్‌, పందిరి వెన్నెలశ్రీలను ముత్యాలనాయుడు సత్కరించారు. కార్యక్రమంలో యోగా గురువు పుల్లేటి సతీశ్‌, ప్రేమ సమాజం రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising