ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులకే ప్రథమ ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-06-24T05:47:12+05:30

ప్రయాణికులకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) కమిషనర్‌ ద్వారక తిరుమల ప్రసాద్‌ అధికారులకు సూచించారు.

మద్దిలపాలెం డిపో ఆవరణలో మొక్కలు నాటుతున్న పీటీడీ కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీటీడీ కమిషనర్‌ ద్వారక తిరుమల ప్రసాద్‌

 ద్వారకాబస్‌స్టేషన్‌, జూన్‌ 23 : ప్రయాణికులకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) కమిషనర్‌ ద్వారక తిరుమల ప్రసాద్‌ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం నగరానికి విచ్చేసిన ఆయన మద్దిలపాలెం డిపోను సందర్శించారు. డిపో, గ్యారేజీ నిర్వహణ, బస్సుల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం మద్దిలపాలెం డిపోలో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల సంఖ్య పెంచుకోగలిగినప్పుడే పీటీడీకి అధిక ఆదాయం వస్తుందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి సుమారు 150 మంది పీటీడీ ఉద్యోగులు మృతి చెందారని విచారం వ్యక్తంచేశారు.  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి, సీఎంఈఎం విజయరత్నం, విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సి.రవికుమార్‌, విశాఖపట్నం రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం, డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్లు బి.అప్పలనాయుడు(అర్బన్‌), సీహెచ్‌ అప్పలనారాయణ (విశాఖ జిల్లా) డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు కణితి వెంకటరావు(జిల్లా), ఎం సుధాబిందు(అర్బన్‌), మద్దిలపాలెం డిపో మేనేజర్‌ అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కమిషనర్‌ ప్రారంభించారు.   తొలుత తగరపువలసలో ఏర్పాటు చేయనున్న బస్సు డిపో, గ్యారేజీ స్థలాలను ఆయన పరిశీలించారు. వీటి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు.


Updated Date - 2021-06-24T05:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising