ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమల్లోకి పాక్షిక లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-04-21T05:24:50+05:30

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో పట్టణంలో మంగళవారం నుంచి వ్యాపారులు పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.

అరకులోయలో మధ్యాహ్నం తరువాత మూతపడిన దుకాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరకులోయలో మధ్యాహ్నం తరువాత దుకాణాలు మూసివేత


అరకులోయ, ఏప్రిల్‌ 20: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో పట్టణంలో మంగళవారం నుంచి వ్యాపారులు పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కిరాణా, ఇతర దుకాణాలను మధ్యాహ్నం రెండు గంటల నుంచి, కూరగాయలు, బేకరీలను నాలుగు గంటల నుంచి మూసివేయాలని వర్తక సంఘం, పౌరసంక్షేమ సంఘం నిర్ణయించాయి. దీంతో సాయంత్రం నుంచి రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసంక్షేమ సంఘం అధ్యక్షుడు డి.గోవర్దన్‌, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.కృష్ణారావు, సాంబు, తదితరులు పాల్గొన్నారు.


పాడేరులో వస్త్ర వ్యాపారులు ... 

పాడేరు: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పాక్షిక లాక్‌డౌన్‌ను పాటించాలని పట్టణంలోన వస్త్ర వ్యాపారులు నిర్ణయించారు. మే నెల 20వ తేదీ వరకు దుకాణాలన్నీ సాయంత్రం ఐదు గంటలకే మూసేయాలని తీర్మానించినట్టు వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులు త్రినాథ్‌, సత్యారావు, రొబ్బి శంకరరావు, కొణతాల సతీశ్‌ తదితరులు తెలిపారు.  


Updated Date - 2021-04-21T05:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising