రైతుబజార్లకు వారానికొక రోజు సెలవు
ABN, First Publish Date - 2021-01-23T05:35:13+05:30
నగరంలోని 13 రైతుబజార్లకు వారానికొకరోజు సెలవు ప్రకటిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 13 రైతుబజార్లకు వారానికొకరోజు సెలవు ప్రకటిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. పరిశుభ్రత, ఇతరత్రా పనుల నిర్వహణ కోసం ఆయా రోజుల్లో రైతుబజార్లను మూసివేయనున్నట్టు వెల్లడించారు. గోపాలపట్నం, ములగాడ, కంచరపాలెం, పెదవాల్తేరు, పెదగంట్యాడ, సీతమ్మధార రైతుబజార్లకు మంగళవారం, నరసింహనగర్, ఎంవీపీ కాలనీ, మర్రిపాలెం, గాజువాక, పెందుర్తి, స్టీల్‌ప్లాంట్, మధురవాడ రైతుబజార్లకు బుధవారం సెలవు ఉంటుందన్నారు. ఈ విధానం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని, రైతులు, వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు.
Updated Date - 2021-01-23T05:35:13+05:30 IST