ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెదకోనెల సమస్యలపై ఆరా

ABN, First Publish Date - 2021-12-08T05:46:56+05:30

మండలంలోని ఎన్‌ఆర్‌పురం పంచాయతీ పెదకోనెల గ్రామాన్ని మంగళవారం మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఊటనీటిని పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామంలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు


అనంతగిరి రూరల్‌, డిసెంబరు 7: మండలంలోని ఎన్‌ఆర్‌పురం పంచాయతీ పెదకోనెల గ్రామాన్ని మంగళవారం మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, గ్రామంలో పలువురు వ్యాధులతో బాధపడుతున్నారని, తారునీరు, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. తాగునీటి పథకాన్ని, రహదారిని, పక్కా ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తాగునీటి ఊటను పరిశీలించారు. తాగునీటి పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనలో జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు టి.మితుల, ఎంపీడీఓ నగేష్‌, ఈఓపీఆర్‌డీ మల్లేశ్వరరావు, సర్పంచ్‌ సన్యాసమ్మ మాజీ సర్పంచ్‌ కోటపర్తి గంగులు, వీఆర్‌ఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T05:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising