ఒడ్డెక్కని వంతెన కష్టాలు
ABN, First Publish Date - 2021-10-29T06:09:24+05:30
మండలంలోని గవరవరం వద్ద శారదా నదిపై వంతెన నిర్మాణం ఏళ్ల తరబడి కొనసా... గుతున్నది.
ఏళ్ల తరబడి కొనసా...గుతున్న ‘గవరవరం’ పనులు
నత్తనడకన అప్రోచ్ రోడ్ల నిర్మాణం
పట్టించుకోని అధికారులు
వరదలకు కొట్టుకుపోయిన తాత్కాలిక కాజ్‌వే
రాకపోకలు మూడు మండలాల ప్రజల ఇబ్బందులు
చోడవరం, అక్టోబరు 28: మండలంలోని గవరవరం వద్ద శారదా నదిపై వంతెన నిర్మాణం ఏళ్ల తరబడి కొనసా... గుతున్నది. సిమెంట్ కాంక్రీట్ పనులు ఐదారు నెలల క్రితం పూర్తికాగా, వంతెనకు ఇరువైపులా చేపట్టిన అప్రోచ్ పనులను నత్తనడకన జరుగుతున్నాయి. కొత్త వంతెన అందుబాటులోకి రాకపోవడం, గతంలో నిర్మించిన కాజ్‌వే వరదలకు ధ్వంసం కావడంతో మూడు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
చోడవరం మండలం గవరవరం వద్ద శారదా నదిపై వున్న వంతెన 2013లో సంభవించిన భారీ వరదలకు కుంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల పరిధిలోని సుమారు వంద గ్రామాలకు రవాణా సదుపాయం స్తంభించి పోయింది. నదికి ఒక వైపు గ్రామాలు, మరోవైపు పొలాలు వున్న రైతులు ఇక్కట్లయితే వర్ణనాతీతం. వర్షాకాలంలో రోజుల తరబడి పొలాలకు వెళ్లలేకపోతున్నారు. అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాత్కాలికంగా రాకపోకల కోసం కాజ్‌వే నిర్మించారు. తక్కువ ఎత్తులో నిర్మించడంతో వరద ప్రవాహానికి కాజ్‌వే కొట్టుకుపోవడం, మరమ్మతులు చేయడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ కొత్త వంతెన నిర్మాణానికి 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నాబార్డు ఆర్‌ఐడీఎఫ్-9 స్కీమ్ కింద రూ.15 కోట్లు మంజూరుచేసింది. అయితే వంతెన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల తయారీలో మార్పులు, చేర్పులు పేరుతో అధికారులు రెండేళ్లు తాత్సారం చేశారు. ఎట్టకేలకు 2017 మే నెలలో నాటి మంత్రి అయ్యన్నపాత్రుడు వంతెన నిర్మాణానికి కావడం లేదు. కొత్తగా కొన్న ఫ్లాట్‌లో కుటుంబంతో కలిసి వుండాలనుకునే వారు తప్ప పెట్టుబడి కోసం ఎవరూ ఫ్లాట్లను కొనడం లేదు.మధురవాడ, పెందుర్తి ప్రాంతాల్లో ఫ్లాట్ అద్దెలు రూ.7 వేలకు మించి రావడం లేదు. నగరంలో కూడా రూ.కోటి పెట్టి ఫ్లాట్ కొన్నా రూ.20 వేలకు మించి అద్దె రావడం లేదు. ఇలా ఆలోచిస్తున్నవారు ఫ్లాట్‌పై కాకుండా స్థలంపై డబ్బు పెడితే భవిష్యత్తులో మంచి ధర వస్తుందని, అటు దృష్టి పెడుతున్నారు. దీనివల్ల ఫ్లాట్లు అమ్ముడుపోక చాలామంది బిల్డర్లు నష్టాలు చవిచూస్తున్నారు. మధురవాడ నుంచి అచ్యుతాపురం వరకు నగర పరిధిలో దాదాపు 30 వేల ఫ్లాట్‌లు అమ్మకానికి వున్నాయంటే నిర్మాణ రంగం పరిస్థితి ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది వరకు మధురవాడ జాతీయ రహదారి నుంచి కిలోమీటరు లోపు గజం రూ.23 వేలు, సుజాతనగర్, కూర్మన్నపాలెం, పెందుర్తి ఏరియాల్లో గజం రూ.20 వేలు నుంచే లభ్యమయ్యేది. రాజధాని ప్రకటనతో ఎన్‌ఆర్‌ఐలు, ఇతర నగరాల నుంచి ఇన్వెస్టర్లు నగరానికి వచ్చి భూములపై పెట్టుబడులు పెట్టడంతో సాధారణ ప్రజలు, ఇక్కడున్న చిన్న బిల్డర్లు ఎక్కడా స్థలం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు అటు హైదరాబాద్, ఇటు ఒడిశా రాష్ట్రం గుణుపూర్, రాయఘడ, బరంపూర్, పర్లాకిమిడి వెళ్లి తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో వంతెన నిర్మాణం పూర్తిచేయాలి. కానీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆది నుంచీ పనులను నత్తనడకన సాగిస్తు న్నారు. వంతెన చివరి శ్లాబు పనులు ఈ ఏడాది మే నెలలో పూర్తిచేసి, అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టారు. నాలు గు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అప్రోచ్ పనులు చేయ లేదు. చేసిన పనులకు సంబంధించి ఇంకా రూ.80 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో వున్నాయని, అందువల్లనే కాంట్రాక్టర్ పనులు నెమ్మదిగా చేయిస్తున్నారని తెలిసింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు సైతం వంతెన అప్రోచ్ రోడ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు గట్టిగా చెప్పలేకపోతున్నట్టు సమాచారం.
రాకపోకలకు జనం అగచాట్లు
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో శారదా నదిలో వరద నీరు పోటెత్తడంతో గవరవరం వద్ద నదిపై వున్న తాత్కాలిక కాజ్‌వే పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు కొత్త వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో సుమారు 100 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, జీపులు, కార్లు వంటి వాహనాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. అప్రోచ్ రోడ్ల పనులు అసంపూర్తిగా వుండడంతో ద్విచక్ర వాహనాలను కిందకు దించడానికి, పైకి ఎక్కించడానికి ఇద్దరు, ముగ్గురు కలిసి కుస్తీలు పట్టాల్సి వస్తున్నది. గవరవరం వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై ఆర్‌అండ్‌బీ జేఈ జ్ఞానేశ్వరరావును వివరణ కోరగా...వంతెన శ్లాబ్ పనులు పూర్తయ్యాయని, అప్రోచ్ రోడ్ల పనులు జరుగుతున్నాయని, డిసెంబరు నాటికి వంతెన అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఎనిమిదేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నాం
కొల్లి దేముడు, చొప్పగడ్డి అప్పారావు, గవరవరం
శారదా నదిపై వంతెన కూలిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నది. తాత్కాలికంగా కాజ్‌వే నిర్మించినప్పటికీ ఏటా వర్షాకాలంలో ధ్వంసం అవుతుండడంతో మూడు మండలాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ ఇరువైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సత్వరమే పనులు పూర్తిచేయించి వంతెనను అదుబాటులోకి తీసుకురావాలి.
Updated Date - 2021-10-29T06:09:24+05:30 IST