ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.10 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

ABN, First Publish Date - 2021-06-23T05:15:54+05:30

మండలంలోని కణమాం పంచాయతీలో సుమారు రూ.పది కోట్లు విలువ చేసే సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమణకు పాల్పడి అందులో పక్కా నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూమిలో అనధికారిక నిర్మాణాలు చేపడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు 

ఆనందపురం, జూన్‌ 22: మండలంలోని కణమాం పంచాయతీలో సుమారు రూ.పది కోట్లు విలువ చేసే సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమణకు పాల్పడి అందులో పక్కా నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కణమాం గ్రామంలోని సర్వే నంబర్‌-50లో 3.56 ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన వ్యక్తి ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపడుతున్నట్టు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ భూమి తనకు ఎక్స్‌ ఆర్మీ కోటాలో వచ్చిందని, తనకు నచ్చిన నిర్మాణాలు చేపడతానని ఆ వ్యక్తి తమపై జులుం ప్రదర్శించడంతో పాటు తప్పుడు కేసును బనాయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై వీఆర్వో మంగరాజును వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, రికార్డులు పరిశీలించి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టినట్టయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కూల్చివేత పనులు చేపడతామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-23T05:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising