ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ స్ఫూర్తిప్రదాత

ABN, First Publish Date - 2021-01-19T06:17:42+05:30

ఎన్టీఆర్‌ ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు.

పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల, మాజీ ఎమ్మెల్యే రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల, మాజీ ఎమ్మెల్యే రాజు


చోడవరం, జనవరి 18: ఎన్టీఆర్‌ ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే  కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం గంధవరం గ్రామంలో పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అలాగే పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన గొప్ప నేత ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన స్ఫూర్తితో అంతా ముందుకు సాగుదామని చెప్పారు. కార్యక్రమంలో గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ మల్లునాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్స్యరాజు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు పూతి కోటేశ్వరరావు, మజ్జి గౌరీశంకర్‌, మాజీ ఎంపీపీ గూనూరు పెదబాబు, నాయకులు బొడ్డేడ నాగగంగాధర్‌, పల్లా అర్జున్‌, మల్లునాయుడు పాల్గొన్నారు. 


బుచ్చెయ్యపేటలో...

మండలంలోని బంగారుమెట్ట, రాజాం, తురకలపూడి గ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అలాగే పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు జి.కోటేశ్వరరావు, కె.రవికుమార్‌, ఎన్‌.సత్యనారాయణ, కె.సత్యనారాయణ, టి.దాసు, డి.కిశోర్‌, ఎం.బాబ్జి, ఎస్‌.శేషు, డి.శ్రీను, వి.అప్పారావు, ఎం.సతీశ్‌ పాల్గొన్నారు.


రావికమతంలో...

మండల కేంద్రంతో పాటు జెడ్‌.కొత్తపట్నంలో ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పేదలకు దుస్తులు అందించారు. భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మండల అధ్యక్షుడు ఆర్‌.కొండనాయుడు, నాయకులు ఎం.ఫాల్గుణ, గాలి రమణబాబు, తాతాజీ, తారక్‌, కోట సత్యనారాయణ, గెంజి సూర్యనారాయణ, పి.సత్యనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు.


రోలుగుంటలో...

మండల కేంద్రంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థి సుర్ల రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు జి.చంద్రమౌళి, నాయకులు గండి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T06:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising