ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 432 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-04-15T05:30:00+05:30

జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువా రం గత రికార్డులను తిరగరాస్తూ 432 కొత్త కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువా రం గత రికార్డులను తిరగరాస్తూ 432 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 66,937 కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి 62,931 మంది కోలుకోగా, మరో 3,442 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు మృతిచెందారు. వీటితో కొవిడ్‌ మరణాలు 564కు చేరాయి. 


ముగ్గురు ఉక్కు ఉద్యోగులు మృతి

కరోనా బారినపడి చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు ఉక్కు ఉద్యోగులు మృతిచెందినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరు వాత సుమారు వంద మంది ఉద్యోగులు, కార్మికులు కొవిడ్‌ బారినపడగా, ఆస్పత్రుల్లో కొందరు, హోమ్‌ ఐసోలేషన్‌లో వుండి మరికొందరు చికిత్స పొందుతు న్నారు. అయితే  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు ఉక్కు ఉద్యోగులు గురువారం మృతి చెందినట్టు పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఒకరు స్టీల్‌మెల్ట్‌ షాప్‌ విభాగంలో డీజీఎం కాగా...మరొకరు ఇంజనీరింగ్‌ షాప్స్‌ అండ్‌ ఫౌండ్రీ డీజీఎం. ఇంకొకరు ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికుడిగా ప్లాంట్‌ వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising