కర్నూలు జిల్లాకు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య బదిలీ
ABN, First Publish Date - 2021-06-05T05:33:51+05:30
నర్సీపట్నం సబ్‌కలెక్టర్ నారపరెడ్డి మౌర్యకు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా పదోన్నతి కల్పించి బదిలీ చేసింది.
పది నెలల పాలనలో తనదైన ముద్ర
నర్సీపట్నం, జూన్ 4 : నర్సీపట్నం సబ్‌కలెక్టర్ నారపరెడ్డి మౌర్యకు రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా పదోన్నతి కల్పించి బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మౌర్య గత ఏడాది ఆగస్టులో తొలి పోస్టింగ్ నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా పొందారు. విధుల్లో చేరిన తర్వాత బ్రిటీష్ కాలం నాటి సబ్‌కలెక్టర్ బంగ్లా, సబ్ కలెక్టర్ కార్యాలయానికి మరమ్మతులు చేయించి పూర్తిగా రూపురేఖలు మార్చేశారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు విశేషంగా కృషి చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్, కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించేవారు.
Updated Date - 2021-06-05T05:33:51+05:30 IST