ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొమ్మ పడింది

ABN, First Publish Date - 2021-07-31T05:59:46+05:30

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం తెరుచుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు నెలల విరామం తర్వాత తెరుచుకున్న థియేటర్లు

నగరంలో 12, రూరల్‌లో 3 థియేటర్లలో సినిమాల ప్రదర్శన

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం తెరుచుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 15 థియేటర్లలో సినిమాలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సగం మంది ప్రేక్షకులనే అనుమతించారు. 


జిల్లా వ్యాప్తంగా సుమారు వందకుపైగా థియేటర్లు ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో ఏప్రిల్‌ 25 నుంచి థియేటర్లన్నీ మూతపడ్డాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. సినిమా థియేటర్లను 50 శాతం ప్రేక్షకులతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నగర పరిధిలోని జగదాంబ, శారదా, మెలోడి, సంగం, శరత్‌, కిన్నెర, 104 ఏరియాలో లక్ష్మీనరసింహా, ఊర్వశితోపాటు గాజువాకలోని మూడు థియేటర్లలో సినిమాలను ప్రదర్శించారు. ఇవికాకుండా రూరల్‌ జిల్లాలో మరో మూడు థియేటర్లలో సినిమాలు ప్రదర్శించినట్టు సమాచారం. శనివారం నుంచి మరికొన్ని థియేటర్లలో సినిమాలను ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు చర్యలు ప్రారంభించారు. కొత్త సినిమాలు విడుదలయ్యేంత వరకూ ప్రేక్షకుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉంటుందని, అయినప్పటికీ థియేటర్లను మూసి ఉంచకూడదనే ఉద్దేశంతో తెరుస్తున్నామని ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు.  

Updated Date - 2021-07-31T05:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising