ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్ట కాలంలో కదిలిన మనసులు

ABN, First Publish Date - 2021-05-11T05:12:23+05:30

కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల కారణంగా ఎందరో నిరుపేదలు పట్టెడన్నం కోసం తహతహలాడుతున్నారు.

పాయకరావుపేటలో పేదలకు సరుకులు అందజేస్తున్న దళిత సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  


పాయకరావుపేట/ఎస్‌.రాయవరం, మే 10: కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల కారణంగా ఎందరో నిరుపేదలు పట్టెడన్నం కోసం తహతహలాడుతున్నారు. అయినప్ప టికీ కడుపు నిండే మార్గం లేక చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు కొందరు దాతలు పెద్ద మనస్సుతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేశ్‌ సహకారంతో విశాఖ జిల్లా అధ్యక్షుడు బోడపాటి శ్రీను తదితరులు సోమవారం పాయకరావుపేటలో సుమారు వంద మంది పేదలకు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. గోపాలపట్నం శివారు పెద్దిరాజుపాలెం గ్రామానికి చెందిన కొర్ని నాని అనే యువకుడు  పలువురు అనాధలు, యాచకులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశాడు. అలాగే, ఎస్‌.రాయవరం మండలం సర్వసిద్ధి గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ఈరిగిల అప్పలకొండ (1986- 87)  టెన్త్‌ బ్యాచ్‌లో కొన్ని కుటుంబాల వారితో పాటు మరికొందరు పేదలకు సోమవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం, రెండు కిలోల  కందిపప్పు, వంట నూనె , పంచదార, చింతపండు, గోధమనూక, ఉల్లిపాయలు, శానిటైజర్లు, మాస్క్‌లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. 

Updated Date - 2021-05-11T05:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising