ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-29T05:48:23+05:30

మానసిక ఆందోళనతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతురాలు అరుణ (ఫైల్‌)

కొమ్మాది, అక్టోబరు 28: మానసిక ఆందోళనతో ఓ వివాహిత  ఆత్మహత్య చేసుకున్న  సంఘటన గురువారం  పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలబోయిన అరుణ (22) అనే వివాహిత కొమ్మాది కూడలిలోని బహుళ అంతస్థుల భవనంలోని సెకండ్‌ ఫ్లోర్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఆమె తండ్రి సూర్యనారాయణ ఈ భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తూ భార్య అప్పలనరసమ్మతో కలిసి ఉంటున్నాడు. అరుణను విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలోని దూపేట గ్రామానికి చెందిన బంధువైన అలబోయిన సంతోశ్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి నాలుగేళ్ల శృతి అనే పాప ఉంది. ఉద్యోగం నిమిత్తం సంతోశ్‌ ఏడేళ్ల క్రితం మధురవాడ బొట్టవానిపాలెంలో భార్య, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో సంతోశ్‌, అరుణల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. సంవత్సరం క్రితం అరుణ మెదడుకు సంబంధించిన వ్యాధికి గురవ్వడంతో భర్త కేజీహెచ్‌లో చికిత్స చేయించాడు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, తరచూ కోపం, చిరాకు  పడుతూ అసహనంగా ఉండేదని, తనకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుండేదని తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో భార్యాభర్తలు మధ్య గొడవలు జరుగుతుండడంతో భర్త సంతోశ్‌పై అరుణ దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అప్పటినుంచి అరుణ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. గురువారం భవనం పైనుంచి దూకి అరుణ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సీఐ రవికుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని తల్లిదంద్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-10-29T05:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising