ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-06T05:06:10+05:30

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరులు కురిపించే చల్లనితల్లి బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

అమ్మవారి మూలవిరాట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి

అమ్మవారి మకరతోరణం ప్రారంభించిన స్వాత్మానందేంద్ర

విశాఖపట్నం, డిసెంబరు 5: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరులు కురిపించే చల్లనితల్లి బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఆదివారం  శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ఉదయం 10.01 గంటలకు జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. టీటీడీ దేవస్థానం అధికారులు  అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


దాతల ఆర్థిక సాయంతో కొన్న 60 కిలోల వెండితో తయారు చేసిన మకర తోరణంను పెందుర్తి శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్‌.జె.మాధవి, సిబ్బంది వి.రాంబాబు, పి.రామారావు, మావూరి వెంకటరమణ, మన్యాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T05:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising