ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏదీ..‘దీవెన’?

ABN, First Publish Date - 2021-04-24T05:27:01+05:30

‘విద్యతోనే పేద బతుకులకు బంగారు భవిత’ అని పదేపదే చెప్పే ప్రభుత్వం...అందుకోసం ప్రవేశపెట్టే పథకాలను కొందరికి వర్తింపజేయడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత ఏడాది జగనన్న విద్యా దీవెన పథకానికి నోచుకోని పలువురు డిగ్రీ విద్యార్థులు

ఫీజుల కోసం కళాశాలల  ఒత్తిడి

‘వసతి దీవెన’ది అదే పరిస్థితి


నర్సీపట్నం, ఏప్రిల్‌ 23: ‘విద్యతోనే పేద బతుకులకు బంగారు భవిత’ అని పదేపదే చెప్పే ప్రభుత్వం...అందుకోసం ప్రవేశపెట్టే పథకాలను కొందరికి వర్తింపజేయడం లేదు.  విచిత్రంగా...‘జగనన్న విద్యా దీవెన’, ‘వసతి దీవెన’ పథకాలకు అర్హులైన వారి జాబితాల్లో పేర్లు వున్నా కొందరి అకౌంట్లలో  డబ్బులు జమ కాకపోవడం విస్మయపరుస్తోంది.

2019-20 విద్యా సంవత్సరంలో ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుకున్న పలువురు విద్యార్థులకు  జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల నిధులను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆన్‌లైన్‌లో, సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాల్లో వారి పేర్లు ఉన్నా..ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఈ విధంగా నష్టపోయిన విద్యార్థుల సంఖ్య ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే సుమారు 551 మంది వరకూ ఉంది. వీరికి ప్రభుత్వం రూ.11 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉంది. 

వైసీపీ ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) పథకానికి చుట్టింది. ఈ పథకం కింద ఫీజు మొత్తాన్ని కళాశాలల యాజమాన్యం ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని అప్పట్లో సీఎం ప్రకటించారు. ఇదిలావుంటే, గత ఏడాది ఫిబ్రవరిలో ‘వసతి దీవెన’ పథకానికి శ్రీకారం చుట్టారు. డిగ్రీ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు చొప్పున రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించి, మొదటి విడత నగదు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ పథకం విద్యార్థులందరికీ అందలేదు. 


నష్టపోయిన 551 మంది విద్యార్థులు

నర్సీపట్నం నియోజవర్గంలో 2019-20లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుకున్న 552 మందికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల నిధులు మంజూరుకాలేదు. శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో 220 మంది, జేకే కళాశాలలో 83 మంది, శ్రీసాయి డిగ్రీ కళాశాలలో 138 మంది, డి .యర్రవరం మదర్‌ డిగ్రీ కళాశాలలో 60 మంది, మాకవరపాలెం మండలం ఇమ్మాన్యుయల్‌ కళాశాలలో 50 మంది విద్యార్థులకు నగదు అందలేదు. వీరందరికీ వసతి దీవెన మొదటి విడత రూ.10 వేలు తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఇప్పుడు రెండో విడత వసతి దీవెన నగదు మంజూరు చేస్తారో...లేదోనన్న ఆందోళనతో ఉన్నారు. అలాగే విద్యా దీవెన పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఖాతాల్లో జమ కావల్సి ఉండగా, అది కూడా జమ కాలేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఖాతాల్లో జమ చేయకపోవడంతో చాలా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులతో ఫీజులు కట్టించుకున్నాయి. దీనిపై ఏఎస్‌డబ్ల్యూవో సత్యనారాయణను వివరణ కోరగా, జాబితాలో ఉన్న వారందరికీ ప్రభుత్వం నగదు జమ చేసినట్టు చెప్పారు.

Updated Date - 2021-04-24T05:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising