ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా ధర్నాను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2021-12-08T05:59:06+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పాతగాజువాకలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు పిలుపునిచ్చారు.

రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న ఎన్‌.రామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు

కూర్మన్నపాలెం, డిసెంబరు 7: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పాతగాజువాకలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 299వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో బ్లాస్ట్‌ఫర్నేస్‌ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎంపీలు అందరూ కలసి స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని  కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ కార్మికుల ఐక్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. ఈ శిబిరంలో పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, గంధం వెంకటరావు, రామస్వామి, రామచంద్రరావు, రామకృష్ణ, అప్పలరాజు, గంగవరం గోపి, ప్రసాద్‌, సూర్యనారాయణ, బాబు, కోటేశ్వరరావు, విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising