ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంలో పక్కాగా లాక్‌డౌన్‌, కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-05-14T05:13:08+05:30

కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలో ప్రజలు, వర్తకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న లాక్‌డౌన్‌, ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పక్కాగా అమలవుతున్నది.

నిర్మానుష్యంగా ఉన్న పాడేరు అంబేడ్కర్‌ కూడలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సమయానికి దుకాణాలు బంద్‌

నిర్మానుష్యంగా రహదారులు

పాడేరు, మే 13: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలో ప్రజలు, వర్తకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న లాక్‌డౌన్‌, ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పక్కాగా అమలవుతున్నది. ప్రభుత్వం కర్ఫ్యూ, 144 సెక్షన్‌ ప్రారంభించక ముందు నుంచే ఏజెన్సీలోని పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్లు తెరిచేవారు. అలాగే ఏజెన్సీ 11 మండలాల్లో జరిగే 42 వారపు సంతలను పూర్తిగా రద్దు చేశారు. ఈక్రమంలోనే మే ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకువచ్చింది.  మన్యంలోని ప్రజలు మాత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు. అలాగే అన్ని రకాల వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేస్తుండడంతో జన సంచారం నిలిచిపోయి రోడ్లు, ప్రధాన కూడళ్లు సైతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.  

 

Updated Date - 2021-05-14T05:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising