ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేకే బిల్లులకు వెనుకంజ

ABN, First Publish Date - 2021-08-03T05:53:45+05:30

రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకే ఉపాధి పథకం బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నదని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌


తుమ్మపాల, ఆగస్టు 2: రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకే ఉపాధి పథకం బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నదని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సోమవారం టీడీపీ శ్రేణులతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాత  బిల్లులు చెల్లించకపోతే కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సుమారు రూ.120 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. దీంతో కాంట్రాక్టర్ల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతిని  ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. అనకాపల్లిలో ప్రతీ రోడ్డు   అధ్వా నంగా తయారైందని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ బకాయి బిల్లుల చెల్లింపులపై  కక్షపూరితంగా వ్యవహ రిస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చికూర రాము, కొణతాల శ్రీనివాసరావు, శంకర్ల పద్మలత, ధనాల విష్ణుచౌదరి, సందిన సునీల్‌, శెట్టి వెంకటరమణ, కోడి నాగేశ్వరరావు, మేడిశెట్టి నూకరాజు, సన్యాసినాయుడు, కోట్ని ఈశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising