ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదుములు ఇలా.. పొలాలకు నీరెలా..?

ABN, First Publish Date - 2021-06-24T05:43:58+05:30

ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతల్లో పలువురికి ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేదు.

మంగవరం కాలువపై నిర్మించిన మదుముకు తలుపులు లేని దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని సాగు నీటి శాఖ

 పాయకరావుపేట రూరల్‌, జూన్‌ 23: ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతల్లో పలువురికి ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేదు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు సాగునీటి కాలువలపై నిర్మించిన మదుం (స్లూయిస్‌)లు శిథిలావస్థకు చేరుకోవడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం వీటిని నిర్మించినప్పటికీ నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో నేడు ఇవి ఉత్సవ విగ్రహాల్లా మారాయి. పలుచోట్ల తలుపులు ఊడిపోయి, గోడలు శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మండలంలోని గుంటపల్లి గ్రామం వద్ద గుంటపల్లి కాలువ స్లూయిజ్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఈ సమస్యను రైతులు అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లినా స్పందించే వారు కరువయ్యారు.  అదేవిధంగా మంగవరం వద్ద మంగవరం కాలువపై కింద పొలాలకు నాలుగు పిల్ల కాలువల ద్వారా నీరందే విధంగా నిర్మించిన మదుం శిథిల స్థితికి చేరింది. దీంతో మెరక కాలువలోని పొలాలకు  నీరందే పరిస్థితి కనిపించ డం లేదు. దీనిపై సాగునీటి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేక పోతోందని ఆయా రైతులు వాపోతు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని వారంతా కోరున్నారు.  ఈ సమస్యలను సాగునీటి శాఖ ఏఈఈ లోకేష్‌ వద్ద ప్రస్తావించగా, మదుంల మరమ్మతుకు ప్రతిపాద నలు పంపామ న్నారు. నిధులు మంజూ రైన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - 2021-06-24T05:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising