ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

ABN, First Publish Date - 2021-12-03T06:10:18+05:30

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తామని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కోరాడ రాజబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాల్లో 15 రోజుల పాటు ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తాం

టీడీపీ ‘భీమిలి’ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు

భీమునిపట్నం, డిసెంబరు 2: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తామని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడి టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కావాల్సినంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన కరపత్రాలను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు జీవీఎంసీలోని తొమ్మిది వార్డుల్లో 15 రోజుల పాటు ఆత్మగౌరవ సభలను నిర్వహిస్తామన్నారు. సీఎం జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని విమర్శించారు. ఆఖరికి గౌరవంగా వుండాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో మహిళలపై అసభ్యకరమైన పదజాలాలను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన శపధం మేరకు ఆయన సీఎం అయ్యేంతవరకు కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేయాలని రాజబాబు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి డీఏఎన్‌ రాజు, నాయకులు పెంటపల్లి యోగేశ్వరరావు, మారోజు సంజీవి, కోరాడ రమణ, టి.సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T06:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising