ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీ ప్రమాదంలో కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-04-21T05:23:35+05:30

బవులవాడ సమీపంలోని వెంగమాంబ స్టోన్‌ క్రషర్‌కు చెందిన క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరొకరికి తీవ్ర గాయాలు

కొత్తూరు, ఏప్రిల్‌ 20:
బవులవాడ సమీపంలోని వెంగమాంబ స్టోన్‌ క్రషర్‌కు చెందిన క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్‌ ఎస్‌ఐ ఈశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. బవులవాడ గ్రామానికి చెందిన చొప్పా పైడిరాజు (37) కొండ రాయిని పగులగొట్టేందుకు మంగళవారం క్వారీలోకి వెళ్లాడు. పక్కనే ఉన్న వేరొక రాయిని పేల్చేందుకు పెట్టిన జెల్టెన్‌స్టిక్స్‌ కొండబాంబును చూసుకోకుండా కంప్రెజర్‌తో రాయిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా పేలడంతో రాళ్ల ముక్కలు పైడిరాజు, మరో కార్మికుడు ఊడి సత్తిబాబుపై పడ్డాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పైడిరాజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ సత్తిబాబు అనకాపల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్‌ఐ ఈశ్వరరావు చెప్పారు. పైడిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కు కోల్పోయామని వారు భోరున విలపిస్తున్నారు.

Updated Date - 2021-04-21T05:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising