ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనేటిరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-03-24T06:35:25+05:30

రాజులపాలెంలో గల శ్రీవేంకటేశ్వరాలయంలో కోనేటిరాయుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

ప్రత్యేక అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం, మార్చి 23: రాజులపాలెంలో గల శ్రీవేంకటేశ్వరాలయంలో కోనేటిరాయుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రబాతం, అగ్ని ప్రతిష్ఠ, కుంభవాహన తదితర కార్యక్రమాలను ఆగమ శాస్త్ర రీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి తిరు కల్యాణ వేడుకలకు  ముక్కోటి దేవతలను ఆహ్వానించటానికి  శ్రీమహా విష్ణువు ఇష్ట వాహనం గరుత్మంతుడిని కొలుస్తూ ధ్వజారోహనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గరుత్మంతుడు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు గరుడ ముద్దలను ఎగుర వేశారు. ఈ ప్రసాదం స్వీకరిస్తే సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు పోటీపడి అందుకున్నారు. శ్రీవారి ఆలయాన్ని మామిడి ఆకులతో, అరటి, కొబ్బరి పందిళ్లతో, రకరకాల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. శేష వాహనంపై పురవీథులలో శ్రీవారిని ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనివాసరావు, పద్మావతి, బి.అశోక్‌ రాజు, కళ్లేపల్లి శ్రీనివాస వర్మ, కృష్ణంరాజు, విజయరామ రాజు, సుబ్బరాజు, వీఆర్‌ఎస్‌ వర్మ, మధు వర్మ, వరహాల బాబు, చంద్రశేఖర్‌, జగ్గరాజు,  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising