ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోడవరంలో 81 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-01-17T05:59:46+05:30

చోడవరం సామాజిక కమ్యూనిటీ ఆసుపత్రిలో శనివారం 81 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు.

వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం, జనవరి 16: చోడవరం సామాజిక కమ్యూనిటీ ఆసుపత్రిలో శనివారం 81 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. మొత్తం వంద మందికి వేయాల్సి ఉండగా, 12 మందిక గైర్హాజరయ్యారు. ఏడుగురు వ్యాక్సిన్‌పై విముఖత చూపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పత్రాలు అందచేశారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో నలుగురు కొంత అసౌకర్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రిలో మంచాలపై ఉంచి వైద్య సేవలు అందించడంతో కోలుకున్నారు. మిగిలిన వారికి ఎటువంటి సమస్యలు రాలేదు. కాగా, కొవిడ్‌ వ్యాక్సిన్‌తో జీవితానికి కొత్త భరోసా లభించిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనాపై పోరాటంలో ముందున్న వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, వైద్యాధికారులు మహేశ్‌, దమయంతి, ఆసుపత్రి కమిటీ చైర్మన్‌ జ్యోతుల రమేశ్‌, నాయకులు శ్రీకాంత్‌, ఏడువాక సత్యారావు, పి.నరసింగరావు, నెహ్రూ, బైన ఈశ్వరరావు, ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising