ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ సెకెండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-05-12T05:12:52+05:30

కొవిడ్‌ మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సాధారణ ప్రజలు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు.

వేములపూడి పీహెచ్‌సీలో సిబ్బందితో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ మౌర్య

నర్సీపట్నం, మే 11:
కొవిడ్‌ మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సాధారణ ప్రజలు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు. వేములపూడి పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి, బౌతిక దూరం పాటించాలని కోరారు. డివిజన్‌లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు రెండో మోతాదు వ్యాక్సిన్‌ వేయనున్నట్టు చెప్పారు. మొదటి డోసు తీసుకొని నాలుగు వారాలు దాటిన వారికి సెకెండ్‌ డోస్‌ వేస్తారన్నారు. పీహెచ్‌సీలలో కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ అందుబాటులో ఉంటాయన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌లో వారికి సమాచారం ఇస్తారని, ఒకవేళ సమాచారం రాకపోతే పీహెచ్‌సీలకు నేరుగా వెళ్లి వేయించుకోవచ్చునని సబ్‌ కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-12T05:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising