ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరాల విజృంభణ

ABN, First Publish Date - 2021-07-25T05:34:36+05:30

జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తు న్నాయి. నెల క్రితం వరకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తే...ఇప్పుడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు వణికిస్తున్నాయి.

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న జ్వరపీడితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో నెల రోజుల్లో 99 మలేరియా కేసులు

పలువురికి డెంగ్యూ

సబ్‌ యూనిట్‌ పరిధిలో ఆరు రోజుల్లో 460 మంది జ్వరపీడితులకు చికిత్స


నర్సీపట్నం, జూలై 24:  జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తు న్నాయి. నెల క్రితం వరకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తే...ఇప్పుడు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు వణికిస్తున్నాయి. పట్టణంలోని శారదా నగర్‌కు చెందిన దేవానంద్‌, మాకవరపాలెం మండలం జి.కోడూరుకు చెందిన గోరంట్ల రాజు శనివారం డెంగ్యూతో ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక అర్చన టైఫాయిడ్‌తో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గచ్చపువీధికి చెందిన పైల రమణ, కొయ్యూరు మండలం శీకాయపాలేనికి చెందిన చిన్నలక్ష్మి అనే వృద్ధురాలు మలేరి యాతో చికిత్స తీసుకుంటున్నారు. జూన్‌ 26 నుంచి ఈ నెల 23 వరకు నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో మలేరియాతో 99 మంది చికిత్స పొందారు. ఇంకా సాధారణ జ్వరాలతో 102 మంది, వైరల్‌ జ్వరాలతో 97 మంది వైద్యం పొందారు.

ఆరు రోజుల వ్యవధిలో 460 మందికి చికిత్సలు

నర్సీపట్నం మలేరియా సబ్‌ యూనిట్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి 23 వరకు ఆరు రోజుల వ్యవధిలో 460 మంది జ్వరాలకు చికిత్స పొందారు. వేములపూడి పీహెచ్‌సీలో 47 మంది, మాకవరపాలెంలో 59, బూరుగుపాలెంలో 58, నాతవరంలో 60, గుణిపూడిలో 64, గొలుగొండలో 42, రోలుగుంటలో 82, బుచ్చింపేటలో 22, కేవీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మంది జ్వరాలకు వైద్యం పొందారు.  


కిక్కిరిసిపోతున్న ప్రైవేటు ఆస్పత్రులు

ఇదిలావుంటే, ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి బెన్నయ్య మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ కేసులు వచ్చిన ప్రాంతాల్లో దోమల మందు స్ర్పేయింగ్‌ చేయిస్తున్నామన్నారు. ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, బకెట్లు, కుండీలపై మూతలు పెట్టుకోవాలని సూచించారు.

ఇటీవల వర్షాలు పడుతుండడంతో దోమల బెడద అధికమైంది. ఈ సమయంలో  వారానికి ఒకసారైనా దోమల నివారణ మందు పిచికారీ చేయాలి. కానీ మునిసిపాలిటీలు, పంచాయతీల్లో ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు ఫలితంగా రోజురోజుకు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది.

Updated Date - 2021-07-25T05:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising