ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2021-12-31T06:16:52+05:30

అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి నిర్మాణం వల్ల పలు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న రైతులకు సత్వరమే న్యాయం చేయాలని తహసీల్దార్‌ రమాదేవి ఆధికారులను ఆదే శించారు.

అధికారులతో సమావేశమైన తహసీల్దార్‌ రమాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ రమాదేవి

సబ్బవరం, డిసెంబరు 30: అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి నిర్మాణం వల్ల పలు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న రైతులకు సత్వరమే న్యాయం చేయాలని తహసీల్దార్‌ రమాదేవి ఆధికారులను ఆదే శించారు. జాతీయ రహదారి నిర్మాణంలో బాటజంగాల పాలెం, అసకపల్లి, ఇరువాడ, పెదనాయుడుపాలెం, తవ్వవానిపాలెం గ్రామాల్లో పలుచోట్ల గెడ్డలు, వాగులను పూడ్చేశారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచ్‌లు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి వీటిని తీసుకురావడంతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించడంతో గురవారం ఆమె హైవే అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎక్కడెక్కడ గెడ్డలు దెబ్బతిన్నాయో డీఈ శ్రీచరణ, ఏఈ రామలక్ష్మణ హైవే అధికారులకు వివరించారు. ఇప్పటికే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని డీఈ పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లామని, త్వరలోనే సమస్యను పరిస్కరిస్తామని జాతీయ రహదాని నిర్మాణానికి చెందిన దిలీప్‌ బిల్డ్‌కాన్‌ అధికారులు తహసీల్దార్‌కు వివరించారు. ఈ సమావేశంలో సర్పంచ్‌లు దెడ్డం ప్రసాదరావు, పడాల వెంకటరమణ, బలిరెడ్డి కనకరాజు, బోకం స్వామినాయుడు, కర్రి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T06:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising